టి ఎస్ ఐ డి సి చైర్మన్ గా వేణుగోపాలచారి…
భైంసా రూరల్ డిసెంబర్ 29 జనం సాక్షి
ముధోల్
తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సముద్రాల వేణుగోపాల చారి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.గతం లో కేంద్ర మంత్రిగా,రాష్ట్ర మంత్రిగా పని చేసిన ఇయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయన సేవలను మరింత వినియోగించు కోవాలన్న ఉద్యేశ్యం తో చైర్మన్ పదవి కట్టబెట్టింది.




