ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణసంస్థ విభజనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విభజన చట్టం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీని ఎలా విభజించాలనే అంశంపై కేంద్ర రవాణశాఖామంత్రి నితిన్‌గడ్కరీ శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ విభజన ఓ కొలిక్కి రానుంది.




