Sunday, 8 November 2026

ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీల పై

ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీల పై అవగాహన సదస్సు,,ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీల పై అవగాహన సదస్సు,,
కొమురం భీం జిల్లా/చింతలమానేపల్లి మండలం (జనం సాక్షి )24 నవంబర్:చింతలమానేపల్లి మండల కేంద్రం లో  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రవీంద్ర నగర్ బ్రాంచ్ మేనేజర్  రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆర్థిక మరియు డిజిటల్ అక్షరాస్యత శిబిరాన్ని కళాజాత బృందంచే చింతలమానేపల్లి  గ్రామ పంచాయతీ కార్యాలయంలో  నిర్వహించారు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అందిస్తున్నా సామాజిక భద్రతా పథకాలతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతులు మరియు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ గురించి బ్రాంచ్ మేనేజర్ ఖాతాదారులకు వివరించడం జరిగింది ,పంట రుణాలు  రైతులు రెనివల్ గడువులోపు పునఃరుద్దరణ చేసుకోవాలని తెలిపారు, అనంతరం కళాజాత బృందం చే  బ్యాంకింగ్ ప్రాముఖ్యత, లావాదేవలపై, పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను మ్యాజిక్ షో ఆట పాటల ద్వారా ఖాతా దారులకు క్లుప్తంగా అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ రవీందర్ రెడ్డి,సి,ఎస్,పి మస్తాక్ హుస్సేన్, ఖాతా దారులు రైతులు పాల్గొన్నారు