Sunday, 8 November 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో”ప్రభుత్వ డిగ్రీ

“ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో”ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ పై అవగాహన   సదస్సు”
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:(జనం సాక్షి) 24 నవంబరు: కాగజ్ నగర్ రూరల్:కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) శిక్షణా కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు టాస్క్ రీజినల్ మేనేజర్ దీప హాజరై డిగ్రీ విద్యార్థులకు టాస్క్ శిక్షణ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.టాస్క్ లో పేరు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ శిక్షణా నైపుణ్యాలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి సర్టిఫికేట్ సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు.కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను టాస్క్ లో నమోదు చేయడం జరిగిందని విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ కోఆర్డినేటర్ టి.దత్తాత్రేయ, అధ్యాపకులు రాజు, రాజేశ్వర్, డి.జనార్ధన్ ఎస్.వెంకటేశ్వర్లు   పాల్గొన్నారు