వాషింగ్టన్ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బాధ్యతను పూర్తి చేశామని చెప్పారు. బలమైన కుటుంబాలు, నముదాయాలతోనే బలమైన అమెరికా నిర్మాణం అవుతుందన్నారు.




