సూర్యాపేట ప్రతినిధి, మార్చి22 (జనంసాక్షి): క్యాన్సర్ తో బాధపడుతున్న మోదిన్ పురం గ్రామ వార్డు నెంబర్ వంగూరి సుశీలకు దాతలు స్పందించి ఆర్థిక తోడ్పాటును అందించాలని హైకోర్టు అడ్వకేట్ సగరపు ప్రసాద్ అన్నారు. బుధవారం ఆమె నివాసంలో పరామర్శించి మెడిసిన్ కోసం రూ.10 వేల ఆర్ధిక సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనో ధైర్యంతో ఉండాలని, క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు.ఆర్థిక సహకరం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోళ్ళ రవీందర్ రెడ్డి, జీ.కోటయ్య , దుర్గయ్య , శ్రీనివాస్ రెడ్డి, కాంతమ్మ , సైదా, సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఆర్ధిక సాయం అందజేతఆర్ధిక సాయం అందజేత




