Thursday, 5 November 2026

సామాజిక సేవకులు కొయ్యడి గంగయ్య.

నెరడిగొండమార్చి22(జనంసాక్షి):సామాజిక సేవకుడైన కొయ్యడి గంగయ్య ఓవృక్ష మిత్రుడని,మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.మండలంలోని కుఫ్టీ గ్రామానికి చెందిన సామాజిక సేవకు కొయ్యడి గంగయ్య కేటీఆర్ పార్క్ లో ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం రోజున ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ తోపాటు చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మన్ సింగ్ మాజీ జడ్పీటీసీ కవి గడ్డం భీంరెడ్డిలు హాజరయ్యారు.ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తు ఉగాది పచ్చడి సేవించారు. తదనంతరం కెటిఆర్ వనంలో మొక్కలు నాటారు.ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చుటకు చలివేంద్రంను ప్రారంభించారు.చాలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కొయ్యడి గంగయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ రాథోడ్ సజన్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుటకు మానవ మనుగడ కోసం చెట్లను ప్రతి ఒక్కరూ నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలని,సామాజిక సేవకుడైన కొయ్యడి గంగయ్య ఓ వృక్షా మిత్రుడని కొనియాడారు.ఉగాది పచ్చడి షడ్రుచుల విశిష్టత గురించి కవి గడ్డం భీంరెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోపాటు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రుక్మన్ సింగ్ గ్రామ సర్పంచ్ రాజు యాదవ్ కవి గడ్డం భీంరెడ్డి కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ నాయకులు శివారెడ్డి దావుల బోజన్న సర్పంచ్ రాజు యాదవ్ కొయ్యడి గంగయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నా