హైదరాబాద్,(జనంసాక్షి): లక్నో వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ భద్రత సిబ్బంది మంగళవారం ఓ బుల్లెటును స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో భాగంగా అతడి వద్ద బుల్లెట్ లభ్యమయింది. దాంతో అతడిని ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు తరలించారు.




