Tuesday, 3 November 2026

తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటే యనమల

హైదరాబాద్‌: తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటేనని దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ధ్రువీకరించాయని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. రెండు పార్టీల సంబంధంపై ప్రజలకు స్పష్టత వచ్చిందని ఆయన అన్నారు. జగన్‌ ఎప్పటికైనా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేది ఖాయంగా తెలుస్తోందని యనమల అభిప్రాయపడ్డారు. పిల్ల కాంగ్రెస్‌లో రెండోళ్ల లోపే ముసలం పుట్టిందన్న ఆయన అన్ని జిల్లాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే వై.ఎస్‌ విజయమ్మ ప్రాంతీయ సదస్సుల పేరుతో పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *