హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సజావుగా ఉందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించారు. హైదారాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. డయల్ 100 ద్వారా ప్రతి రోజుకి 3 వేలకుపైగా ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. దీని ద్వారా నిందితులను త్వరితగతిన పట్టుకోవడం వీలులుగుతుందని చెప్పారు.
అలాగే ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలివిడతగా 90 పీఎస్‌లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రిసెప్షన్ సెంటర్లో పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండదని ఆయన పేర్కొన్నారు. అలాగే పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసే వారికి రసీదు అందజేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు.




