Tuesday, 3 November 2026

ఆర్ కె హాస్పిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట (జనంసాక్షి): మెరుగైన వైద్యాన్ని అత్యుత్తమ సాంకేతికతతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందించేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్లు ఆ హాస్పిటల్ నిర్వాహకులు మామునూరి రమేష్, వేల్పుల రవి, మామిడి వెంకటేష్ తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో మోర్ సూపర్ మార్కెట్ పక్కన ఆర్ కె హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు జనరల్ అండ్ క్రిటికల్ కేర్, గైనిక్ , ఈఎన్టీ, డెంటల్ విభాగంలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద నగరాలు,పట్టణాల్లో అందించే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తాము పేద మధ్య తరగతి ప్రజల కోసం జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 24 గంటల వైద్య సదుపాయంతో పాటు ఫార్మసీ, అంబులెన్స్ , ల్యాబ్ , వెంటిలేటర్ సౌకర్యం ఉన్నట్లు తెలిపారు. తాము అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.