ఆలేరు: నల్గొండ జిల్లాలోని ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం ఆలేరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను ప్రతిపాదిత జనగామ డివిజన్‌లో చేర్చవద్దని డిమాండ్ చేశారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయని పక్షంలో ప్రస్తుత మాదిరిగానే భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరారు. రాస్తారోకోతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెదేపా, భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం నాయకులు నర్సింహులు, బిక్షమయ్య, శోభారాణి, వెంకటేశ్వర్లు రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.