Thursday, 5 November 2026

ఆల్విన్ కాలనీ డివిజన్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు

ఆల్విన్ కాలనీ డివిజన్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: కుమార్ యాదవ్

కూకట్ పల్లి జనంసాక్షి

ఆల్విన్ కాలనీ డివిజన్ లో అనేక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి లతో కలిసి కుమార్ యాదవ్ డివిజన్ లోని నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిహెచ్ఎంసి అడిషనల్ మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ మాట్లాడుతు ఏళ్ళమ్మబండ ప్రాంతంలోని ఉషా ముల్లపూడి రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. అవసరమున్న చోట క్రాసింగ్ లు పెట్టకుండా టిఆర్ఎస్ నాయకులకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. అలాగే వెంటనే రోడ్ విస్తరణ కూడా చెయ్యాలని అన్నారు. అనంతరం జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్లలో భూకబ్జాలు చేస్తూ అక్రమ ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే కమలప్రసన్న నగర్ ఎస్బిఐ బ్యాంక్ వెనుక భాగంలో కనీసం సెట్ బ్యాక్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు అంతస్థుల అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సాయి కుమార్, ప్రధాన కార్యదర్శులు రఘు,రాజు, బీజేవైఎం నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.