సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం…
నిర్మల్ జిల్లా, జనం సాక్షి భైంసా రూరల్
నిజామాబాద్ ఎం.పీ అరవింద్ పై తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా భైంసా పట్టణ కేంద్రంలో శనివారం ఏరియా ఆసుపత్రి ముందు పట్టణ భాజపా శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్బంగా బిజెపి పట్టణఅధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఏదైనా ఎదుర్కోవాలని ఉంటే రాజకీయపరంగా ఎదుర్కోవాలని ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడకూడదని తెలిపారు.ఎం.పీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడికి బిజెపి శాఖ తరపున పూర్తిగా ఖండిస్తున్నామని ఇలాంటి చర్యలు పునరువతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే,కౌన్సిలర్ గౌతమ్ పింగలే,నిర్మల్ జిల్లాఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్,బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు




