ఆవడం పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత.
నెన్నెల, డిసెంబర్ 1, (జనంసాక్షి )
మండలం లోని ఆవడం జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనా సదస్సు, కళాజాత నిర్వహించారు. రూ.439 ద్వారా జీవనజ్యోతి భీమా పథకం, ₹ 20 ద్వారా సురక్ష భీమా పథకం, ₹ 1000తో అటల్ పెన్షన్ యోజన, మరియు ఎస్బిఐ జనరల్ భీమా పథకాల గురించి కళాజాత ద్వారా అవగాహనా కల్పించారు. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోపు రుణాలను తిరిగి చెల్లించి వడ్డీ రాయితీ పొందవచ్చని, స్వయం సహాయక సంఘాలు నెలనెలా క్రమం తప్పకుండ కిస్తీలు చెల్లించి ఋణం రూ. లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందని వివరించారు. ఖాతాదారులు పొదుపు చేసే విషయాలపై అవగాహనా కల్పించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సంతోష్, ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి, అకౌంటెంట్ అజయ్ కుమార్, క్యాషియర్ నరేష్ కుమార్, కళాజాత బృందం సభ్యులు రమేష్, శివ, బాబు, బ్యాంకు సిబ్బంది పోషమల్లు, రాజన్న, ఖాతాదారులు పాల్గొన్నారు
ఆవడం పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత




