ఆశాలకు వేతనం రు.26వేలు ఇవ్వాలి
-సీఐటీయూ
అశ్వారావుపేట, డిసెంబర్ 5 (జనంసాక్షి)
ఆశ వర్కర్లకు ఫిక్సిడ్ వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) మండల కార్యదర్శి కీసరి జయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ములకలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన మెమోరాండం డాక్టర్ ఉదయలక్ష్మి కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లతో అదనపు పనులు చేయించుకుంటుందని దానికి తగిన పారితోషికాన్ని ఇవ్వడం లేదని అన్నారు. ఆశ వర్కర్లు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నారని ప్రభుత్వం అనేక పనులు అప్పజెప్తున్నదని కష్టమైన భరించి పనిచేస్తున్నారని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. పెరిగిన ధరలకనుగుణంగా ఫిక్సిడ్ వేతనం రు.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వహిస్తున్న లెబ్రసీ సర్వేలకు, ఇతర కార్యక్రమాలకు అదనంగా పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్కూటమి డబ్బాలు ఆషాలతో మోపించే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టు ఫిక్సిడ్ వేతనం 10000 వెంటనే నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆసుపత్రులలో ఆశాలకు రెస్టు రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆశాలకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు తక్షణమే ఆపాలని అన్నారు. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు టీఏ,డీఏలు ఇవ్వాలని అన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నల్లి సూజత, మద్దూరి రోషమ్మ,తాటి దుర్గ,కుంజా కుమారి, నాగమణి, శైలెజ,కొర్రీ పద్మ, అన్నపూర్ణ,మాలోతు మణిక్యమ్మ,తదితరులు పాల్గొన్నారు




