వరంగల్ బ్యూరో, జూలై 01 (జనం సాక్షి) లైన్స్ ఖుషి క్లబ్ హనంకొండ వారి ఆధ్వర్యంలో ఆశాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. శనివారం డాక్టర్స్ సందర్భంగా ఆశాలపల్లి గ్రామంలో హెల్త్ చెకప్ క్యాంప్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఫ్రీ మెడిసిన్ చెకప్ చేపించడం జరిగింది. డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఒక 50 నుంచి 60 మంది పిల్లలకు ప్రి మెడిసిన్ ఇప్పియడం జరిగింది అదేవిధంగా ఆశాలపల్లి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఆరు రకాల ఆట వస్తువులు మరియు స్కూలు ముందు చెట్ల కార్యక్రమము సర్పంచి కిషోర్ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటి నీరు పోసి మొక్కల పెంపకం యొక్క బాధ్యతను లైన్స్ ఖుషి క్లబ్ తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా మన గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్స్ కి మరియు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆశాలపల్లి గ్రామ సర్పంచి కిషోర్ మరియు కాపుల కనపర్తి ఎంపీటీసీ బాలకృష్ణ స్కూల్ హెడ్మాస్టర్ భాస్కర్ మా కృషి క్లబ్ నుంచి డిస్టిక్ కోఆర్డినేటర్ జయశ్రీ పద్మజ పోనుగోటి పాపారావు క్లబ్ ప్రెసిడెంట్ మాడిశెట్టి రాజేందర్ సెక్రెటరీ మునగాల సురేందర్ రావు ట్రెజరర్ పొన్నబోయిన కుమారస్వామి ఈ ప్రోగ్రాం కృషి క్లబ్ మెంబర్స్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారికి ఆశాలపల్లి గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు





