భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణం లోని 28 వ వార్డ్ లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టం వచ్చినట్టు సి సి రోడ్ మరియు డ్రైనేజీ పనులు బడ్జెట్ లో పెట్టినవి కాకుండా ఎక్కడ పడితే అక్కడ( అవసరం లేని చోట మరియు మంచిగా ఉన్న ప్లేస్ )లోకూడా కనీసం వార్డ్ కౌన్సిల్లర్ కి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించాకుండా నిధులు అన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. గారి పర్సనల్ నిధులు అని చెప్పి మున్సిపల్ కి సంబందించిన యు టి ఎఫ్ ఐ డి సి నిధులు తెరాస నాయకులకు అనుగుణంగా ఎక్కడ పడితే అక్కడ నిధులన్నీ వ్యర్థం చేస్తున్నారు.ఇట్టి పనులను స్థానిక కౌన్సిల్లర్ కైరంకొండ వెంకటేష్ గారు మరియు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ కౌన్సిల్లర్ ఈరపాక నర్సింహా గారు మరియు కాలనీ వాసులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసారు..
యుటిఎఫ్ఐ డిసి నిధులతో సిసి రోడ్డు అండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్




