హైదరాబాద్: ఆసరా పథకాన్ని మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేసేందుకు మంత్రి కేటీఆర్ వినూత్న చర్యలు చేపట్టారు. ఆసరాలో అవినీతికి పాల్పడే వ్యక్తులు, అధికారులు, అనర్హుల వివరాలు తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు. సలహాలు, ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్, ఈ-మెయిల్ ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ 18002001001, ఈమెయిల్ aasarapensions@gmail.comలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 28 లక్షల మంది లబ్దీదారులకు పింఛన్లు మంజూరు చేశాయని మంత్రి వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు అందించే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.




