Monday, 2 November 2026

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రాహుల్‌కు మూడు పసిడి

పతకాలు
బాపట్ల : దోహాల్లో జరుగుతున్న ఆసియా యూత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బాపట్ల మండలం స్టువర్టపురానికి చెందిన క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్‌ మూడు బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 77 కిలోల కేటగిరీ విభాగంలో స్నాచ్‌లో ఓవరాల్‌గా 289 కిలోల బరువును ఎత్తడంతో మూడో పసిడి పతకాన్ని సాధించాడు. రాహుల్‌ను కోచ్‌లు ఎస్‌. ఏ సింగ్‌, మాణిక్యాలు, ఏపీ స్పోర్ట్స్‌ స్కూల్‌ సంచాలకులు నర్సయ్యలు అభినందించారు. స్టువర్టపురంలో కుటుంబసభ్యులు మిఠాయిలు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *