`కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మీ
బాపట్ల : పెద్దపల్లి ఎంపీ వివేక్, సీనియర్ నాయకులు కె. కేశవరావులు పార్టీని వీడటం బాధాకరమని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో అమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తెలంగాణ ను సాధించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌పార్టీ స్వంత ప్రయోజనాల కన్నా దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.




