ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు పి.వెంకటస్వామిని పరామర్శించిన జర్నలిస్టులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 1(జనంసాక్షి):
శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి
మహబూబ్ నగర్ లోని నేహా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెట్రో ఈవినింగ్ స్టాప్ రిపోర్టర్ పి. వెంకటస్వామిని
ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు పరామర్శించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ నుండి తాడూరు మండలం నెల్లికుదురు వెళుతుండగా మార్గమధ్యంలో గుంత కోడూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని అంబులెన్స్ ద్వారా నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మహబూబ్ నగర్ లోని నేహా ఆసుపత్రి కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదంలో ఎడమ భుజం చీలమండ దగ్గర ఎముక విరిగింది.శనివారం అతనికి నేహా ఆసుపత్రి ప్రధాన డాక్టర్ విజయకాంత్ పలు శాస్త్ర చికిత్సలు చేసి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న నవతెలంగాణ స్టాప్ రిపోర్టర్ పరిపూర్ణం,వార్తా తరంగాలు స్టాప్ రిపోర్టర్ కిషోర్, జనం సాక్షి స్టాప్ రిపోర్టర్ సందు యాదగిరి, సూర్య పత్రిక రిపోర్టర్ సందడి రవీందర్ రెడ్డి,ఉదయం స్టాప్ రిపోర్టర్ మలిపెద్ది రమేష్ లు పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో అనేక ఒడిదుడుకలు వస్తుంటాయని,చిన్న చిన్న ఘటనలకే మానసికంగా కుంగిపోరాదని అతనికి మనోధైర్యం కల్పించారు.




