Monday, 2 November 2026

జనవరి 7న నల్గొండలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు కరపత్రం ఆవిష్కరణ

జనవరి 7న నల్గొండలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు
కరపత్రం ఆవిష్కరణ
మిర్యాలగూడ, జనం సాక్షి. ఎస్సీ ల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ గత 28 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు కత్తుల తులసీదాస్ మాదిగ అన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రామాజీ సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన చలో నల్గొండ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, దేశంలో అధికారంలో ఉన్న భాజపా కూడా ఎస్సీ వర్గీకరణకు 1997 నుండి మద్దతు ప్రకటించిందన్నారు. ఏడవ తేదీన నల్గొండలో నిర్వహించే ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సులో నూతన కార్యవర్గ ఎంపిక కూడా ఉంటుందని వివరించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొంటారని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అంజయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరపక నరేందర్, రాష్ట్ర కార్యదర్శి నూకపంగ కాశయ్య,ఇంద్రవెల్లి శ్రీనివాస్, పరంగి రంజిత్,కొండేటి చంద్రయ్య,కందుల పెద్ద సైదులు, గణపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.