ఆసుపత్రిలో చేరిన మండేలా
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా శనివారం ఉదయం ప్రిటోరియా ఆసుపత్రిలో చేరారు. 94 ఏళ్ల మండేలా ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే ఉన్నప్పకీ ప్రస్తుతం నిలకడగా ఉందని ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. రెండు నెలల కాలంలో ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి.