ఆసుపత్రి కర్చుల కై ఆర్థిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన నేనవత్ దేవ్జ్యనాయక్ గత కొన్ని సంవత్సరాల అనారోగ్యం కారణంగా బాధ పడుతున్నారు..వారికి షుగర్ కారణంగా కాలు తీసేసారు నడువలేని పరిస్థితిలో ఉన్నాడు ..ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలియడం తో నేడు ఊటుపల్లి తండా లో కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పర్యటించి సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తు దేవజ్యనాయక్ నూ పరామర్శించి ఆరోగ్య పరిస్తితులు అడిగి తెలుసుకొని, కుటుంబానికి మనోధైర్యాన్ని నింపుతూ వారి బార్య అయిన *సీత బాయి కి 10,000/-వేల ఆర్థిక సాయం అందించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిల్ల నర్సింహులు , చాపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, గొడుగొనిపల్లి సర్పంచ్ అమృత ఆంజనేయులు,మైలారం నర్సింహులు,గోపాల్ ,నరేష్, తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆసుపత్రి కర్చుల కై ఆర్థిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి




