కాళికా దేవి ఆలయ అభివృద్ధికి 25,000/-వేలు విరాళం కెఎస్అర్ ట్రస్ట్ దోమ జనవరి 7(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో, తండా వాసుల కోరిక మేరకు మీరు మా ఆలయ అభివృద్ధికి కృషి చెయ్యాలని కోరగా ,తక్షణమే స్పందించి విద్య వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ,ఆలయాల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని తమ వంతుగా ఊటుపల్లి తాండ కాళికా దేవి అభివృద్ధికి 25,000/- వేల రూపాయలు విరాళం అందించారు కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిల్ల నర్సింహులు,రాజేందర్,గొడుగొనిపల్లి సర్పంచ్ అమృత ఆంజనేయులు, చపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, గోపాల్, మైలరం నర్సింహులు, నరేష్ ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
కాళికా దేవి ఆలయ అభివృద్ధికి 25,000/-వేలు విరాళం




