ఆస్ట్రేలియాలో ప్రమాదం వరంగల్ యువకుడు మృతి

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ యువకుడు శ్రీవాస్తవ మృతి చెందాడు. ఆస్ట్రేలియాలో శ్రీవాస్తవ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీవాస్తవ మిత్రులు మృతుడి తల్లిదండ్రులకు ఫోన్‌లో విషయం తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో పండుగపూట విషాదచాయలు అలుముకున్నాయి.