హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో కొడుకు తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




