రాజంపేట్ మార్చి 13 జనం సాక్షి
రాజంపేట్ మండలంలో ఘటన
రోడ్డుపై రాస్తారోకో ధర్నా నిర్వహించిన గ్రామస్తులు కుటుంబీకులు
నిందితులతో ఎస్సై కుమ్ముకయ్యారని ఆరోప
కామారెడ్డి జిల్లా రాజంపేట్ చివరి శ్వాస వరకు గంజి పోస్తారు అనుకున్న కూతుళ్లే యమపాశంగా మారి బంధించి దహనం చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులు(75) అనే అతనికి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు కొడుకు గత కొన్ని రోజుల క్రితమే తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు కూతుళ్లకు పెండ్లిలు సైతం చేశాడు. మొదటి భార్య కూతుర్లు సరిగ్గా చూసుకోక పోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య తోటే సహజనం చేస్తా ఉన్నాడు ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి ఆయనతో కూతుర్లు ఆస్తికోసం తండ్రితో గొడవలు చేస్తున్నారు. ఆదివారం చిన్న కూతురు బిడ్డ పెండ్లి విందు కార్యక్రమం కామారెడ్డి లో జరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నుండే తండ్రికి ఇంట్లో తాళం పెట్టి ఉంచి విందుకు వెళ్లారు కూతుర్లు. ఈ విందు ఎక్కడ ఆగిపోతుందోనని ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది ఆదివారం రాత్రి కన్నా తండ్రిని చంపేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. చనిపోతున్న చనిపోతున్నా అని మోత్తుకున్న శబ్దాలుకు చుట్టుపక్కల వారు వెళ్లిన కూతుర్లు దగ్గరకు రానియకుండా అడ్డుపడ్డారు అని గ్రామస్తులు పేర్కొంటున్నారు . ముందే ప్రణాళిక ప్రకారము చంపివేసి మూట కట్టి వేశారా? లేక ఇంటిలోనేతాళం వేసి పెట్రోల్ పోసి దాహనం చేశారని చర్చని అంశంగా మారిందిఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో ఇంటిని కూల్చారు. మాంసపు ముద్దలో పడి ఉన్న ఆంజనేయులు శవాన్ని మాంసపు ముద్దలుగా బయటకు తీశారు తల ఒకసారి మెండం మరోవైపు పడి ఉన్నాయి. దీంతో అర్ధరాత్రి రాత్రికి రాత్రే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో ఇంటిని కూల్చివేసి మాంసపు ముద్దలతో ఉన్నాము మృతుడిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించారు. ఆ అర్ధరాత్రికి రాత్రే మాంసపు ముద్దలను పోస్టుమార్టం తరలించడానికి కారణమేంటి? ఆ రాత్రి పోలీసులు జెసిబి సహాయంతో అల్చల్ చేయాల్సిన అవసరం ఏముంది? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న కుల పెద్దలు గ్రామస్తులు
రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు నిందితులతో ఎస్సై కుమ్ముకయ్యారని, కులస్తుల, గ్రామస్తుల ఆరోపణచేస్తున్నారు,పక్కా ప్లాన్ తోటే దహనం చేశారని ఇంట్లోనే బంధించిన కూతుర్లు,మనవడుచేశారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఇటీవలే ఎకరం భూమి అమ్మడని తెలుస్తోంది.మృతుడి పేరు కొప్పుల ఆంజనేయులు,వయసు 75,ఇంట్లో తాళం వేసి బంధించి దహనం చేశారు.పలు అనుమానాలకు తావిస్తుంది గ్రామస్తులు కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నారు.




