జహీరాబాద్ మే 5( జనం సాక్షి) నియోజకవర్గంలోని కోహిర్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రిలో టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోహిర్ మండల యువ నాయకులు మనియర్ పల్లి రాజు కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఉదయం గ్రామంలో ని చర్చిలో ఆయన పేరు పై ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం స్థానిక ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలిపారు.ఈ సందర్భంగా యువ నాయకులు రాజుకుమార్ మాట్లాడుతూ టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు నర్సమ్మ బలరాం, బాగయ్య, శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.




