ఆ భూమి మాది.. మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది
వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 02 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట ఎదురుగా ఉన్న 351 ,352 ,353 సర్వే నెంబర్లలోని 2095 గజాల పట్టా భూమి తమదేనని దిడ్డి నరేందర్ ఆదివారం తెలిపారు. ఈ స్థలం పై తమకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని తాము ఉదయం స్థలం వద్దకు వెళ్లి పోలీస్ ప్రొటెక్షన్ తో కందకాలు తీసినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ భూమికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి కూడా ఉన్నట్లు నరేందర్ వివరించారు. తమ స్థలంలో ధర్నా చేసి తమకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా నరేందర్ చెప్పారు.




