హైదరాబాద్ : బాపట్ల, విజయవాడ నుంచి ఉత్తరకాశీ వెళ్లిన 11 మందిలో ఏడుగురి జాడ తెలియక వారి బంధువులు అందోళన చెందుతున్నారు. అలాగే ఉత్తరకాశీలో విశాఖకు చెందిన 720 మంది యాత్రికులు చిక్కుకోగా, వారిలో ఇంకా 200 మంది ఆచూకీ లభ్యంకాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చార్‌ధామ్ యాత్రలో ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఏఎస్‌ఐ గురవయ్య మృతిచెందినట్లు సమాచారం.




