Monday, 2 November 2026

ఇంజనీరింగ్ విద్యలో అన్ని బ్రాంచీలు కీలక

ఇంజనీరింగ్ విద్యలో అన్ని బ్రాంచీలు కీలక
విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు
నర్సాపూర్. అక్టోబర్, 31, ( జనం సాక్షి ) ;
ఇంజనీరింగ్ విద్యలో అన్ని బ్రాంచీలు కీలకమేనని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్ సమీపంలోని బి వి ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు, వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ తమ కళాశాలలో అన్ని బ్రాంచీల విద్యార్థులకు ఉత్తమమైన విద్యనందిస్తూ ఆదర్శంగా నిరుస్తున్నట్టు పేర్కొన్నారు.
ఛాయస్ బెస్ట్ క్రెడిట్ సిస్టం ఇంటర్ డిసి ప్లీనరీ ప్రోత్సహిస్తున్ననందున అన్ని శాఖలు సమానమైనవని, ముఖ్యమైనవి అని తెలిపారు. సోషల్ మీడియాలో సమయాన్ని తగ్గిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు అన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, హెచ్ ఓ డి డాక్టర్ శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.