Monday, 2 November 2026

పేదింటి పెళ్లికి ప్రెస్ క్లబ్ సాయం.

పేదింటి పెళ్లికి ప్రెస్ క్లబ్ సాయం.
పోటో: నగదు అందజేస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులు.
బెల్లంపల్లి, అక్టోబర్31, (జనంసాక్షి)
పేదింటి పెళ్లికి పెద్దన్నగా నిలిచి ఆదుకొని అండగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయులు అయ్యారు కాసిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు. వివరాల్లోకి వెళితే కాసిపేట మండల కేంద్రానికి చెందిన మండల కో అప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్ తన కూతురు వివాహం ఈ నెల 17న ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు వెంటనే స్పందించి తాము ఉన్నామని భరోసా కల్పించి పది వేల రూపాయల నగదు అందజేసి ఆదుకున్నారు. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూకట్ల రాజేష్ మాట్లాడుతూ పేదింటి పెళ్లికి పెద్దన్నగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని, మిగిలిన వారు సైతం తమకు తోచిన విధంగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు నజీర్ హుస్సేన్, టంగుటూరి రవిరాజ్, చెట్టి శ్రీధర్, లడ్డురి రమేష్ కుమార్, గంధం దినేష్ తదితరులు పాల్గొన్నారు.