Monday, 2 November 2026

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఘట్‌కేసర్‌: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో తేజస్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వసతిగృహంలో ఉరేసుకుని బలవన్మరణం పొందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతోనే తేజస్విని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *