ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు కన్నుమూత
ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు(85) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాయిలు బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన సాయిలు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయిలు స్త్రీ పాత్రల్లో ఎక్కువగా నటించేవారు. అల్లిరాణి, ద్రౌపది, సత్యభామ, దమయంతి, శశికళ, సావిత్రి వంటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. సాయిలు మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ సంతాపం తెలిపారు. సాయిలు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చందులాల్ తెలిపారు. సాంస్కృతిక శాఖ తరపున రూ. 50 వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. సాయిలు స్వగ్రామం వరంగల్ జిల్లా చినపెండ్యాల. సాయిలుకు నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు.