ఇంజినీరింగ్‌ సీట్లకు గరిష్టపరిమితి

రాష్ట్రమంత్రివర్గం నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లకు గరిష్ట పరిమితి విధించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కళాశాలలో గరిష్టంగా 420 సీట్లకు మాత్రమే అనుమతినివ్వాలన్న నిర్ణయించారు. ఎన్‌బీఏ ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌) ఉంటే మరో 120 సీట్లకు అనుమతినిస్తారు. వచ్చే విద్యాసంవత్సరంలో కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానించారు.