జేఎన్‌టీయూ: డిగ్రీ పూర్తవ్వగానే విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెం పొందించేందుకు తమ సంస్థ గత ఏడాది నుంచి పరిశ్రమల్లో ఇంట ర్న్‌షిప్ ఇప్పిస్తున్నామని స్విచ్ ఐడియా హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ కో-ఫౌండర్ రోహిత్ అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబరు 20న కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ మ్యాథ్స్, లాజికల్, కేస్ స్టడీ అంశాలపై జేఎన్‌టీయూలో నేషనల్ టాలెంట్ ఎక్యుసిసన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, జర్నలిజం తదితర కోర్సులు చదువుతున్న ప్రథమ ఏడాది నుంచి ఫైనల్ ఇయర్ వారు కూడా సెప్టెంబరు 8వ తేదీలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తు తం తమ సంస్థ ముంబై నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తుందని, త్వరలో హైదరాబాద్ నుంచి మరిన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థుల ప్రతిభను బట్టి ఉద్యోగాల ఎంపికకు కృషి చేస్తామన్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థులు ఆయా కంపెనీల్లో ఉచి తం గా ఇంట ర్న్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు www.switchidea.com/ntat, 9555141142ను సంప్రదించవచ్చు.




