Tuesday, 3 November 2026

షాదీ ముబారక్‌కు నిధుల కొరత లేదు: మైనార్టీశాఖ

హైదరాబాద్‌, మైనార్టీ వధువులకు సహాయం అందించే షాదీ ము బారక్‌ పథకానికి నిధుల కొరత లేదని తెలం గాణ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎంజే అక్బర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించి, ఇప్పటి వరకు రూ.75కోట్లు విడుదలచేసిందని చెప్పా రు. ప్రస్తుతానికి డిమాండ్‌ రూ.83కోట్లు ఉం దన్నారు. షాదీముబారక్‌ కింద మొత్తం 16,433 మంది దరఖాస్తులు రాగా, వాటిలో 4216 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, 11,882దరఖాస్తులకు సంబంధించిన బిల్లులు సిద్ధమయ్యాయని చెప్పారు. ఈనెల 22న ‘మైనార్టీ వధువు ‘కానుక’కు కటకట’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి స్పందిస్తూ పైప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *