Tuesday, 3 November 2026

ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానం

ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానం.

కోటగిరి జనవరి 4 జనం సాక్షి:- మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర-1 కళాశాలలో 2023-2024 విద్యా సంవత్స రంగాను ఎంపిసి, బైపిసి మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆసక్తి గల మైనారిటీ(ముస్లిం క్రైస్తవ జైన బుద్ధ పార్సీ),నాన్ మైనారిటీ(ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసి) అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్ అప్లికేషన్లు కోరుతున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ ప్రకటనలో తెలిపారు.అర్హత కలిగిన ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల15 నుండి 30 జనవరిలోగా www. tmreis.telangana.gov.in వెబ్‌సైట్లో లేదా కోటగిరిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలూరు-1లో నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.ఇతర వివరాల కోసం 9493040786,9440622692 ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.