Tuesday, 3 November 2026

మల్యాద్రికి స్పీకర్ పరామర్శ.

మల్యాద్రికి స్పీకర్ పరామర్శ.

కోటగిరి జనవరి 4 జనం సాక్షి:- బాన్సువాడ నియోజక వర్గ బీజేపీ పార్టీ ఇంచార్జీ మాల్యాద్రి రెడ్డి తండ్రి అంకిరెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శిం చారు.ఈ సందర్భంగా అంకిరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ భారాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి,ఉమ్మడి కోటగిరి మండలాల భారాస పార్టీ అధ్యక్షులు ఎజాస్ ఖాన్,బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కాపుగాండ్ల శ్రీనివాస్,మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.