హైదరాబాద్ : ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3లక్షల 24వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 66.44శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పున: మూల్యాంకనం, పున: పరిశీలనకు జులై 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.




