హైదరాబాద్ : కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, కర్నూలు-నంద్యాల ప్యాసింజర్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరలోనే కర్నూలు నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1966 నుంచి నేటి వరకూ రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.




