వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 18 జనం సాక్షిరాజకీయాలకతీతంగా ప్రతి ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజురైన 18,02,088పద్దెనిమిది లక్షల రెండు వేల ఎనబై ఎనిమిదివిలువ గల 18 కళ్యాణలక్ష్మి షాది ముబారక్* చెక్కులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్ అనంతరెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి యువజన నాయకులు సుభాన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




