Wednesday, 4 November 2026

మణి ఆర్వో సిస్టమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ ఫ్లై ఓవర్ వద్ద మణి ఆర్వో సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు.రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు.ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలన్నారు.జిల్లా కేంద్రంకు పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జ్యోతి కరుణాకర్, సాజిత్ ఖాన్, మనీ ఆర్వో సిస్టమ్స్ ప్రొప్రైటర్ ఉయ్యాల లింగయ్య గౌడ్, పబ్బు శ్రీను, బెల్లంకొండ మహేష్, రమేష్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.