వికారాబాద్ రూరల్ మే 16 (జనం సాక్షి)ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న తెలంగాణ సంక్షేమ సారధి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం నారాయణపూర్ గ్రామంలో మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన 24,02,784 ఇరవై నాలుగు లక్షల రెండువేల ఏడు వందల ఎనభై నాలుగువిలువ గల24 కళ్యాణలక్ష్మి షాదిముబారక్* చెక్కులను అందజేశారు.దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రామ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కమల్ రెడ్డి రాళ్ల చిట్టెంపల్లి సర్పంచ్ యాస్మిన్ బేగం బి ఆర్ఎస్ నాయకులు సయ్యద్ గయాజుద్దీన్ గౌసోద్దిన్ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




