Thursday, 5 November 2026

ఇంటింటి సోదాలు నిర్వహించిన పోలీసులు

 

 

 

 

 

ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్07. ఏటూర్ నాగారం మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామునుండి సిఐ మండల రాజు ఆదేశాల మేరకు   ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో సివిల్, సిఆర్పిఎఫ్. పోలీస్ లు కార్డెన్ సెర్చ్  ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఇంట్లో  ఎంతమంది ఉంటున్నారు వారి పేర్లు పూర్తి వివరాలు సేకరించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారని ఆరా తీశారు. తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి గ్రామాన్ని చుట్టుముట్టి ఇంటింటి సోదాలు నిర్వహించడంతో  ఏం జరిగిందో అని తెలియని సందిగ్ధంలో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ  గ్రామంలో ఎవరైనా అనుమానస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులకు ఆశ్రయం కల్పించిన వారికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి పగలంటూ తేడా లేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు రక్షణ కల్పించడమే ద్వేయంగా పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలకు ఏమైనా ఫిర్యాదు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి విన్నవించాలని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయడమే తమ ద్వేయమన్నారు. ఈ కార్యక్రమంలో రెండో ఎస్ఐ ఇంద్ర, సివిల్ మరియు సిఆర్పిఎఫ్  పోలీసులు పాల్గొన్నారు.