Thursday, 5 November 2026

ఇంటికొచ్చిన కంటి వెలుగు.

.!
– కంటి వెలుగు కార్యక్రమం పై సర్వత్ర ప్రశంస
జనం సాక్షి, మంథని: ఇంటికొచ్చి స్వయంగా కంటి పరీక్షలు చేయడంతో కంటి వెలుగు కార్యక్రమం పై సర్వత్ర ప్రశంసలు వెలువడుతున్నాయి. గురువారం మంథని పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కోమురోజు మారుతీ అనారోగ్యం గురి కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇది గమనించిన కంటి వెలుగు ఆపరేటర్ సతీష్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం మారుతీకి అవసరమగు జాగ్రత్తలు చెప్పారు. ఈ విధంగా ఇంటికి వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించడంతో సర్వత్ర అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాధా, ఆశా కార్యకర్త రూప, తదితరులు పాల్గొన్నారు.