ఇంటింటికి తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇంటింటికి తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
మల్దకల్ మార్చి 23 (జనంసాక్షి)తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అదేశాలమేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సూచన మేరకు గురువారం మండలపరిధిలోని నీలిపల్లె గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంచేపట్టారు. మండలపార్టీ అధ్యక్షుడు బంగి గోవిందు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినాభివృద్ధి సంక్షేమపథకాలగురించి వివరించారు.కొత్తవారికి సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుందని,ప్రతి కార్యకర్త  వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో నాయకులు తిరుపతి,లక్ష్మన్న,ఎల్లప్ప, పద్మమ్మ,నర్శింహులు, తదితరులు పాల్గొన్నారు.