ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో దుకాణాలు కేటాయించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్ విస్తరణలో వ్యాపారస్తులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా దుకాణాలు ఖాళీ చేయించి నాలుగేళ్లవుతున్న ఇంత వరకు పాక్షికంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం గాని, పూర్తిగా కోల్పోయిన వారికి దుకాణాలు ఇవ్వకపొవడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ నెల 24న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత మున్సిపల్ ఆఫీస్ స్థలంలో కట్టిన కాంప్లెక్స్ ప్రారంభిస్తున్నారని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా మెయిన్ రోడ్ విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో గాని, పాత మున్సిపల్ ఆఫీస్ స్థలంలో కట్టిన కాంప్లెక్స్ లో గాని దుకాణాలు కేటాయించాలని, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాక్షికంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు.

తాజావార్తలు